Home / News / చంద్రన్న విలేజ్ మాల్స్

చంద్రన్న విలేజ్ మాల్స్

రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు ఇక ‘చంద్రన్న విలేజ్ మాల్స్’గా రూపుదిద్దుకోనున్నాయి. వినియోగదారులకు ఇప్పటివరకు కేవలం నిత్యావసర సరకులే అందించిన రేషన్ షాపులు ఇకపై 500 ఉత్పత్తులు అందించే చిన్నసైజు సూపర్ మార్కెట్లుగా మారనున్నాయి. కిరాణా సరకులు, సబ్బులు వంటి సౌందర్య సాధనాలు, ఇతర గృహావసర వస్తువులు ఎం ఆర్ పి కన్నా 4 నుంచి 35 శాతం తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులకే కాకుండా చౌకధరల దుకాణదారులకు కూడా ఈ ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ లాభదాయకం అవుతున్నాయి. సరకుల అమ్మకం ద్వారా వారికి అదనపు ఆదాయం చేకూరనుంది.

మొదటి దశలో రాష్ట్రంలో 6,500 ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ను నెలకొల్పనున్నారు. దీనికి పైలట్ ప్రాజెక్టుగా మొదటి ‘చంద్రన్న విలేజ్ మాల్’ను వెలగపూడిలోని ఆర్ టి జి కమాండ్ సెంటర్ ఫస్ట్ బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ‘చంద్రన్న విలేజ్ మాల్స్’ ఎలా ఉండబోతున్నాయో ఈ ఫోటోలను చూసి తెలుసుకోవచ్చు.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *