Home / Tourism Places / Gurazala / యరపతినేని” దారిలో వెళ్తే విజయం మీదే..! పార్టీ నేతలకు చంద్రబాబు సలహా

యరపతినేని” దారిలో వెళ్తే విజయం మీదే..! పార్టీ నేతలకు చంద్రబాబు సలహా

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేదల మనిషి. ఆయన నియోజకవర్గంలో ఏ పేదవాడైనా.. ఆకలితో ఉంటే తట్టుకోలేరు. అందరికీ కూడు, గుడ్డ, నీడ అందించాలని తాపత్రయ పడుతూంటారు. మరి అంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారా..?. కష్టమే. అందుకే… ఆయన వినూత్న రీతిలో ప్రజల్లో పార్టీ పలుకుబడి పెంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ ఎప్పుడూ పార్టీ కోసం పని చేస్తూ ఉంటుంది. వారికి అండదండలు.. యరపతినేని అందిస్తారు. వారిని మించి..మరింతగా గ్రామాల్లోకి చొచ్చుకెళ్లి.. పార్టీలతో సంబంధం లేని వారిని సైతం… తెలుగుదేశం పార్టీకి.. ప్రభుత్వానికి దగ్గర చేర్చేందుకు యరపతినేని ఓ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఆ వ్యూహం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసలు పొందింది.

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు సహా… అనేక మంది .. ప్రభుత్వం తరపున గ్రామాల్లో విధులు నిర్వర్తించే వారికి భారీగా జీతాలు పెంచారు. అలాగే… ప్రభుత్వ నిధులతో… చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో ఉపాధి పొందే వారు ఉంటారు. ఇలా ప్రతి విభాగంలోనూ ప్రభుత్వం నుంచి సాయం పొందిన వారిని గుర్తించి ప్రత్యేకంగా వారితో కలిసి… ఓ నెట్వర్క్ను యరపతినేని శ్రీనివాసరావు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరెవరూ.. తెలుగదేశం పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్లు కాదు. కానీ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రాజెక్టుల వల్ల లాభం పొందిన వారు. జీవితాల్ని బాగు చేసిన వారు. వీరు ఎలాగూ… తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ఇస్తారు. వీరు ప్రచారం .. గ్రామాల్లో అత్యంత కీలకం కానుంది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తే…పార్టీ సానుభూతి పరులు కాబట్టి ఎన్నైనా చెబుతారని… సామాన్యజనం అనుకుంటారు. కానీ ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన వారు చెబితే మాత్రం దానికో క్రెడిబులిటి ఉంటుంది. ప్రజలు నమ్ముతున్నారు. అది నిజం కూడా కాబట్టి తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుంది. ఎమ్మెల్యేల పనితీరుపై.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూంటారు. ఆ సర్వేల్లో యరపతినేని.. చేస్తున్న కొత్త ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది. దీంతో చంద్రబాబు యరపతినేని ప్రయత్నాలను అభినందించారు. పార్టీ నేతంలదరూ… యరపతినేని బాటలో నడవాలని ఆదేశించారు. ఎంతైనా యరపతినేని నిజమైన ప్రజాసేవకుడు మాత్రమే కాదు.. పార్టీని… అచ్చమైన ఆస్తిగా మారుతున్నారనడంలో సందేహం. లేదు.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *