Home / News / విజయవాడలో జరిగిన భయంకర మైన బైక్ ప్రమాదం

విజయవాడలో జరిగిన భయంకర మైన బైక్ ప్రమాదం

విజయవాడలో జరిగిన బైక్ ప్రమాదం,ఇద్దరు యువకులు అత్యంత భయంకర మైన రోడ్ ఆక్సిడెంట్ లో మరణించటం చూస్తే మనసు చలించిపోవటమే కాదు కోపంతో రగిలిపోతుంది కొద్దిగా ఆలోచన ఉన్న ఎవరికైనా.

ఇక్కడ మనం చూడవలసిందే ఆ ప్రమాదం మాత్రమే కాదు.
అసలు ఆ ప్రమాదానికి కారణమైన రెండు ముఖ్య విషయాల గురించి.

1. పేరెంటింగ్, అసలు పిల్లలు ఏంచేస్తున్నారు, వాళ్ళకి అంత హై స్పీడ్ బైక్స్ అవసరమా,వ్యసనాలకు బానిసలవుతున్నార అన్న కనీస విషయాలను పట్టించుకునే బాధ్యత తల్లి తండ్రులది కాదా?

2 . యువతలోని విపరీతమైన తాగుడు వ్యసనం రోజురోజుకి పెరిగి పోవటం, చెప్పాలంటే ఒక ప్యాషన్ల తయారయ్యింది ఇది.
ఎవ్వరో వచ్చి మిమ్మల్ని మారుస్తారని, నాకు కంట్రోల్ ఉందని, బీర్ తాగితే మంచిదని,వారానికి ఒకసారి ఒకే అని, ఎంజాయ్ మామా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని, నాకొక్కడికే ఈ లోకం లో బాధలున్నాయన్నట్టు, ఇలా ఏదొక సాకు తో తాగడం.

గుర్తు పెట్టుకోండి యువతలరా మంచైన చెడైన ఒక వ్యసనం అలవాటు అయ్యాక దాని నుంచి బయటికి రావటం చాలా కష్టం,
చెడని తెలిసి కూడా చేస్తే నీ అంత మూర్కుడు ఈ లోకం లో ఉండడు. నువ్వు, నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యం సర్వం పోయాక తీరిగ్గా ఏడ్చినా ప్రయోజనం ఉండదు,ఇక్కడ పోయేది డబ్బు,భవిష్యత్తు,ఆరోగ్యం మాత్రమే కాదు,కుటుంబ పరువు ప్రతిష్టలు, వాళ్ళకి కష్టాలు కూడా.

ఇక్కడ సమస్య తాగే వాడితో, వాడి కుటుంబం తో అంతం కాదు, దాన్ని పర్యవసానం సమాజం కూడ అనుభవించాల్సి వస్తుంది. మచ్చుకు కొన్ని, ఒక సంవత్సరం క్రితం పంజాగుట్ట ఫ్లైఓవర్ పై నుంచి పడిన కార్ వల్ల క్రింది కార్లో ఒక చిన్న పాప, పాప బాబాయ్, తరువాత కొన్ని రోజులకి ఆ పాప తాతయ్య ప్రాణాలు కోల్పోయారు, దీనికి కారణం తాగి కార్ నడిపిన కుర్రాళ్ళు. సమాజంలో జరిగే ఎక్కువ శాతం హత్యాచారాలు, హత్యలు కు కూడా కారణం ఈ తాగుడు వ్యసనమే.

ఈ కోతి లాంటి బుర్రని మాములుగా ఉంటేనే కంట్రోల్ చేయటం కష్టం, అలాంటిది దానికి మత్తు ఎక్కిస్తే ఇక మీ మాట వింటుందా? అన్ని అనార్దలకి ఇదే కారణం.

నేను నా నిజజీవితంలో చాలా మందిని,కుటుంబాలను చూసాను,ఎంతో బాగా బ్రతికి చితికి పోయిన కుటుంబలని చూసాను, వాళ్ళు పడ్డ, పడుతున్న కష్టాలను చూసాను.

చాలా రోజులనుంచి ఈ తాగుడు వ్యసనం గురించి నా ఆలోచలని షేర్ చేసుకోవాలనుకున్న, ఇది సరైన సందర్భం అని పెడుతున్న. ఇది చదివి ఒక్కళ్ళు మారినా నేను ఈ పోస్ట్ రాయటానికి వెచ్చించిన సమయానికి న్యాయం జరిగినట్టే.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *