Home / News / మోడీ దాడులు పై, సుప్రీం కోర్ట్ కు.. మిగతా రాష్ట్రాల మద్దతుతో మోడీ పై యుద్ధం…

మోడీ దాడులు పై, సుప్రీం కోర్ట్ కు.. మిగతా రాష్ట్రాల మద్దతుతో మోడీ పై యుద్ధం…

రాజకీయ ప్రేరేపిత దాడులపై సుప్రీం కోర్టు లో పిటిషన్‌ వేయాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేయాలా లేదా పిల్‌ రూపంలో వేయాలా అన్న ది అధ్యయనం చేయాలని న్యాయశాఖకు సీఎం సూచించారు. కేంద్రం మిధ్య అని గతంలో దివంగత ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. అధికార పార్టీలో ఉన్న నాయకులను వేధించడంతో పాటు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలను భయభ్రాంతులకు గురి చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని మంత్రులు ఆరోపించారు. ఈ తరహా ఐటీ దాడులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న అంశంపై చర్చ జరిగింది. ఆ అవసరం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని న్యాయ శాఖ కార్యదర్శి ఈ సమావేశంలో చెప్పారు.

modi 06102018 3

‘‘ఐటీ దాడులు జరగడం సహజమే. కానీ.. నిర్దిష్ట సమాచారం ప్రకారం, ఒక పద్ధతితో మూకుమ్మడి దాడులు చేస్తారు. కానీ, 200 మంది అధికారులు 19 బృందాలుగా మారి… సూట్‌ కేసులు పట్టుకొని తిరుగుతూ భయాందోళనలు సృష్టించడం… ఎక్కడికి వెళ్తారో తెలియకుండా ఊరంతా తిరుగుతుండటం మొదటిసారి చూస్తున్నా? వీటిని ఐటీ దాడులు అంటారా లేక భయకంపిత వాతావరణం సృష్టించడం అంటారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. అనేక అంశాల్లో రాష్ట్రాల అధికారాలను లాక్కొని వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ చార్జీలు ఒకేలాఉండే ప్రయత్నం చేస్తున్నామన్న పేరుతో ఆ రంగాన్ని తన చేతిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తే రాష్ట్రాలు ఈగలు తోలుకుంటూ కూర్చోవాలా అని ఘాటుగా స్పందించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ తీస్తున్నారన్న కోణంలో దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లే అంశంపై పరిశీలన చేయాలన్నారు.

‘‘టీడీపీ నేతలు బీదా మస్తాన్‌రావు, పోతుల రామారావు ఇళ్లపై దాడులు జరిగాయి. మంత్రి నారాయణ విద్యా సంస్థలపై దాడులకు వెళ్లి అక్కడ మీడియాను చూసి వెనుతిరిగారు’’ అని ఒక మంత్రి వివరించారు. ఇది ఐటీ దాడి కాదని… మోదీ దాడి అని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఈ స్థాయిలో, ఇన్ని బృందాలతో దాడులు గతంలో ఏ రాష్ట్రంలో నూ జరగలేదన్నారు. ‘‘అడవుల్లో ఉన్న వారు ఇలాంటివి చేస్తే ఉగ్రవాదం అంటున్నారు. అధికారం చేతిలో పెట్టుకొన్నవారు చేస్తే అధికారిక ఉగ్రవాదం కాక మ రేమిటి? దీనిపై ప్ర జల్లో కదలిక తేవాలి. ప్రజలు నిరసన వ్య క్తం చేసేలా చేయాలి. కేం ద్రంలో ఇన్ని ప్రభుత్వాలు చూశాం. కానీ, ఇంత హేయమైన రీతిలో వ్యవహరిస్తున్న వారిని ఎప్పుడూ చూడలేదు. దానిని గట్టిగా ఎదుర్కోవాలి’’ అని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి డిమాండ్‌ చేశారు

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *