Home / News / కెసిఆర్ ని ఉతికి ఆరేసిన ఆంధ్రుడు…

కెసిఆర్ ని ఉతికి ఆరేసిన ఆంధ్రుడు…

కెసిఆర్ ! నీ అహంకారంతో, నీకున్న మదంతో, కొవ్వుతో తెలంగాణాను ఎంత నాశనం చేస్తున్నావో అర్ధం అవుతుందా ! నిన్ను ఎవడొ బట్టేబాజ్ అన్నాడు అని నీ అహం దెబ్బతినిందే ! నువ్వు నీ జీవితంలో ఎవడినైనా భట్టే బాజ్, బాడ్కోవ్ అని కాకుండా మరోలా సంభోదించావా ! మరి నిన్ను అదే మాట అనేసరికి పౌరుషం పొడుచుకువచ్చిందా ! నువ్వు మాత్రం అందరినీ తిట్టవచ్చా ! నిన్ను మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదా ఇది కదా నీ దొర బలుపు ! స్టేట్ మొత్తం నీ దొరగడీ,ప్రజలందరూ నీ బానిసలు అనుకుంటున్నావా ! ఎన్నికల్లో అధికారం అప్పగిస్తే తాగటం చేతకాని పిల్లి పాల గిన్నె బోర్లించుకున్నట్లు బోర్లాపడి , ఇప్పుడు ఎన్నికలు రాగానే ఆంద్రోళ్ళు రాక్షసులు అని మరో కొత్తపాట పాడతవా ! ఈ ఐదేళ్ళలో నువ్వు చేసిన పని ఒక్కటి కూడా లేదు. కనీసం ఉన్న మిగులు ఆదాయం తో ఇచ్చిన రాష్ట్రాన్ని, అప్పులపాలు చేసి మరోసారి నీ నీచమైన బుద్దిని బయట పెట్టుకున్నావు !

kcr 0412018 3

మొన్న జి.హెచ్.యం.సి ఎన్నికలప్పుడు ఆంద్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ నోటితో తీస్తానని చెప్పినప్పుడు గుర్తురాలేదా ఈ ఆంద్రోళ్ళ సంగతి ! నీ పదవి కోసం, నీ అధికారం కోసం ఆంద్రోళ్ళు, తెలంగాణోళ్ళు కొట్టుకు చావాలా , నువ్వేమో ప్రగతిభవన్ లో , ఫార్మ్ హోస్ లో కులుకుతావా ! నీకోసం జనాలు చావాలి, విద్వేషాలు పెరగాలి, నీప్రగతి భవన్ గడిలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి, ఇంతకన్నా దొరతనం ఉందా ! నీ ఏడు మండలాలు ఆంధ్రాలో కలుపుకున్నారా ! అవి నీ ఏడు మండాలాలు ఎలా అయ్యాయి ! నీ అయ్యోడివా, నీ అమ్మోడివా ! తెలంగాణా నీ అయ్య జాగీరా ! తెలంగాణా, తెలంగాణా ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది 1956 కి ముందున్న తెలంగాణాలో ఆ ఏడు మండలాలు ఉన్నాయా ! మరి ఏ లెక్కన అవి నీవయ్యాయి ! పోనీ, నీవే అనుకుందాం, మరి ఈ నాలుగేళ్ళనుండి ఏం గాడిదలు కాశావు ! అప్పుడే అది కుదరదు అని కోర్ట్ కి పోవాల్సింది కదా ! అసలు ఏపి పునర్విభజన చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యిందో లేదో కూడా తెలిసుండేది. నీ బతుకు బయటపడేది ! ఈ నాలుగేళ్ళు ఫార్మ్ హోస్ లో పడుకొని ఇప్పుడు లేచి ” ఆంద్రా .ఆంధ్రా ” అని అరుస్తున్నావు.

తెలంగాణా మేధావి సమాజం తెరాస ను తిడితే తెగ బాధపడిపోతూ. వైషమ్యాలు వద్దు, మనమందరం కలిసుందాం అని చెప్తారే ! మరి మీ దొర ఆంద్రోళ్ళని తిడుతున్నప్పుడు మీ చెవుల్లో చుట్టలు పెట్టుకున్నారా ! ఏం అది ఖండించాలి అనే సోయి మీకు లేదా ! లేద మీరు కూడా మీ అహం తగ్గించుకోవటానికి ఒకడు తిట్టించుకొనే పాలేరుండాలి, ఆ పాలేరు అంద్రోడు అనే దొర బలుపు మీ తలలకు కూడా ఎక్కిందా ! మీరు ఆంద్రోడిని తిట్టినప్పుడు సమ్మగా తలూపి, తెలంగాణా ను ఏమనద్దు అనటం లో ఏమైనా అర్దం ఉందా ! మీకుంది కూడా ఆ దొర బలుపే ! ఆ మాటలు ఖండించే ధైర్యం ఒక్క జర్నలిస్ట్ కి కూడా లేదు. వీళ్ళు పాలన ఎలా ఉండాలో సంపాదకీయాలు రాస్తారు. కుక్కలవలె, నక్కల వలె, చచ్చిన పేనులవలె అక్కడ బతుకుతూ ఇక్కడ పెన్నులు లేపి బరాబరా రాస్తారు.

ఫైనల్ గా ఒక్కమాట ! హైదరాబాద్ నీ యబ్బ నీకు ఇచ్చిన ఆస్తి కాదు, అది ఇండియాలో ఒక సిటి, ఎవడైనా ఉండొచ్చు,నువ్వేదో వాళ్ళను ఉండనిచ్చాను అనే ఫీలింగ్ లో ఉంటే మార్చుకో ! నీకున్న బలుపును, అహంకారాన్ని మడిచి నీ గడిలో , నీ పరుపు కిద పెట్టుకో ! మరోసారి , అంద్రోడు ని ఒక్క మాట అన్నావంటే నీ గడిని, నీ పరుపు కింద పెటుకున్న అహంకారాన్ని , నీ పరువుని అన్నిటినీ ఈ ఆంద్రోళ్ళే తరిమి తరిమి కోడతారు, తెలంగాణా సాయుద పోరాటంలో నీ లాంటి దొరలను తరమటానికి సహాయం చేసినవి ఈ చేతులే, మరోసారి, మరో దొరను తరిమికొట్టటానికి కూడా సహాయపడతాయి. ఫైనల్ గా చేతనైతే, నువ్వు ఏం చేశావో చెప్పుకో, చేతకాకపోతే నీ అపోజిషన్ పార్టీలను తిట్టుకో, అంతే కానీ మరోసారి ఆంద్రోళ్ళు అనే పేరు ఎత్తితే మాత్రం పద్దతిగా ఉండదు . మైండ్ యువర్ బ్లడీ లాంగ్వేజ్……

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *