Home / News / 48 గంటల్లో ఇంటర్నెట్‌ అంతరాయాలు!?

48 గంటల్లో ఇంటర్నెట్‌ అంతరాయాలు!?

 ఇంటర్నెట్‌ లేకపోతే లక్షల కోట్ల బ్యాంకు లావాదేవీలు.. మెయిల్స్‌.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌ సంభాషణలు, నెట్‌వర్కింగ్‌ సైట్లు, యాప్‌లు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. రోజూవారీ జీవితంతో పెనవేసుకున్న ఇంటర్నెట్‌.. క్షణకాలం పాటు లేకపోయినా ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఎదురుకాబోతోంది. రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్‌ వినియోగదారులు నెట్‌వర్క్‌ సమస్య ఎదుర్కొనే అవకాశాలున్నాయని రష్యా టుడే పేర్కొంది. ఇంటర్నెట్‌కు సంబంధించి పేర్లను, ఐపీ అడ్ర్‌సలను నియంత్రించే ‘ద ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్‌డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ఐసీఏఎన్‌ఎన్‌)’ వినియోగదారుల భద్రతరీత్యా ఇంటర్నెట్‌ క్రిప్టోగ్రఫిక్‌ కీని మార్చుతోంది.
డొమెయిన్‌ నేమ్‌ సిస్టం రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అని ఆ సంస్థ తెలిపింది. ‘సురక్షిత, స్థిరత్వ, స్థితిస్థాపక ఇంటర్నెట్‌ కోసం క్రిప్టోగ్రఫిక్‌ కీ ని మార్చాల్సి వస్తోంది. తప్పనిసరి నిర్ణయం ఇది. అందువల్ల 48 గంటల సమయంలో వినియోగదారులు ఇంటర్నెట్‌ అంతరాయాల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. వెబ్‌ పేజీలు నెమ్మదిగా తెరుచుకోవడం, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదని చూపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి’ అని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని పేర్కొంది.

About admin

Check Also

పల్నాడు గడ్డపై లోకేష్‌కు గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చిన శీనన్న!

పల్నాడు పర్యటనలో కనివిని ఎరుగని రీతిలో జనం బ్రహ్మ రథం పట్టడంతో మంత్రి లోకేష్‌ మంత్ర ముగ్ధుడయ్యారు. వేలకోలది బైకులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *