Home / News / కేటీఆర్‌ని నిల‌దీసిన హైద‌రాబాదీలు..

కేటీఆర్‌ని నిల‌దీసిన హైద‌రాబాదీలు..

సీమాంద్ర‌కు చెందిన చాలామంది వ్య‌క్తులు కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను ఎంత బాధించాయో కేటీఆర్ ముందు చెప్పారు. కేటీఆర్ త‌న స‌భ‌లో 21 మంది సీమాంధ్రులు మాట్లాడారు. వారంతా కేసీఆర్‌ ఇటీవలి వ్యాఖ్యలు తమను బాధించాయని, తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘నేరుగా చంద్రబాబును టార్గెట్‌గా చేసి మాట్లాడితే టీఆర్‌ఎస్‌కు ఇబ్బందే. చంద్రబాబుపై పరోక్షంగా కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఉన్న మాపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. మన ప్రాంతంలో విజన్‌ ఉన్న నాయకుడిని సీమాంధ్ర ద్రోహులు అంటూ కేసీఆర్‌ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా.. ఇంకా ఆ పార్టీలో కొనసాగడానికి మీకు మనసు ఎలా ఒప్పుతోందో అర్థం కావడం లేదని నిలదీస్తున్నారు’’ అని వారు కేటీఆర్‌ను బ‌హిరంగంగా కోరారు. దాంతో మైండ్ బ్లాకయిన కేటీఆర్ చంద్ర‌బాబును తిడితే ఆంధ్రులు ఫీల‌వ్వ‌ద్దంటూ కొత్త భాష్యం చెప్పారు.

ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే త‌న పంటితో తీస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌ని ఆద‌ర్శంగా తీసుకున్నా ఆయ‌న త‌న‌యుడు చంద్ర‌బాబుపైనే త‌న కోప‌మ‌ని, ఆంధ్రుల‌పై కాద‌ని నంగ‌నాచి మాట‌లు చెబుతున్నారు. ‘‘ఇక్కడ ఉండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి. మీరందరూ నన్ను సోదరుడిగా భావించండి. మీ అందరికీ వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేసీఆర్‌ కుమారుడిగా, టీఆర్‌ఎస్‌ నాయకుడిగా హామీ ఇస్తున్నా. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టండి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స‌ర్ది చెప్పుకున్నారు. చంద్రబాబుతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని వేడుకున్నారు. ఇక‌, కొండ‌గట్టుకు బాధితుల‌కు నిధులు లేవు కాని.. ఏపీకి 100 కోట్లంట‌.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి అడుగ‌డుగునా ప్ర‌జ‌ల నిర‌స‌న‌ను ఎదుర్కొంటున్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పైనా, చంద్ర‌బాబుపైనా ఉన్న సెంటిమెంట్‌ను ఎలా రెచ్చ‌గోట్టి ల‌బ్ది పొందాల‌ని చూస్తోందో ప‌ది కోట్ల తెలుగు ప్ర‌జ‌లు చూశారు. ఇప్పుడు తెలంగాణ‌లో మెజార్టీ స్థానాల్లో నిర్ణ‌యాత్మ‌కంగా ఉన్న ఆంధ్రావారి ఓట్ల కోసం కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్‌లు కొత్త నాట‌కాల‌కు, చేసిన గాయాల‌కు వెన్న పూసే ప‌నులు మొద‌లు పెట్టారు. తాము చంద్ర‌బాబును తిట్టాం కానీ, ఆంధ్రుల‌ను కాద‌ని సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూసే ప‌నిలో కేటీఆర్ నిమగ్న‌మ‌య్యారు. చంద్ర‌బాబుపై కేసీఆర్ చేసిన నీచ‌మైన వ్యాఖ్య‌ల‌తో ప‌రిస్థితి మొత్తం వ్య‌తిరేకంగా త‌యారైంద‌ని అర్థ‌మైందో ఏమో… ఇప్పుడు ఆయ‌న కుమారుడు కేటీఆర్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో తెలంగాణ తరఫున రూ.100 కోట్లు సాయం ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ భావించారంటూ గొప్ప సంగ‌తిని నాలుగేళ్ల త‌ర్వాత కేటీఆర్ ప్ర‌క‌టించారు.

‘‘శంకుస్థాపనకు మోడీతోపాటు కేసీఆర్‌నూ ఏపీ సర్కారు ఆహ్వానించింది. శంకుస్థాపనకు వెళ్లాలా వద్దా అని చర్చ జరిగినప్పుడు మెజారిటీ సభ్యులు వెళ్లాలని చెప్పారు. కేంద్రం ఏం ఇస్తోందో తెలుసుకునేందుకు ప్రధాని కార్యదర్శిని సంప్రదించగా.. మట్టి, నీళ్లేనని జవాబు వచ్చింది. మోడీని అగౌరవ పరచినట్లు ఉంటుందని భావించి సాయం చేయాలన్న నిర్ణయాన్ని కేసీఆర్‌ విరమించుకున్నారు’’ అని కేటీఆర్‌ తెలిపారు. అదండీ సంగ‌తి కేంద్రం తాను ఇవ్వ‌క‌పోగా.. ఇచ్చే కేసీఆర్ ని కూడా చెడ‌గొట్టింద‌న్న మాట‌. ఇక ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆదుకునే పెద్ద మ‌న‌సు త‌మ‌ద‌ని చెప్పుకొంటున్న కేటీఆర్ ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఏపీకి ఎందుకు సాయం చేయ‌లేద‌న్న ధ‌ర్మ సందేహానికి ఆయ‌న బ‌దులివ్వాలి. ఈ నాలుగేళ్ల‌లో ఏపీలో ఎన్నో విప‌త్తులు వ‌చ్చాయి. ఆ స‌మ‌యాల‌లో ఏపీ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని ఎందుకు అనిపించ‌లేదో కేటీఆర్ బ‌దులివ్వాలి. తెలంగాణ ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉంటే త‌న రాష్ట్ర ఖ‌జానా నిండుకుంద‌ని తెలిసి కూడా ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. వాళ్లు మ‌న సోద‌రులే అని భావించి పెద్దెత్తున ఆర్థిక సాయం చేశారు. ఇక‌, పార్ల‌మెంట్‌లో ఏపీ ఎంపీలు మోడీ ప్ర‌భుత్వంతో పోరాడుతుంటూ ఇత‌ర రాష్ట్రాల ఎంపీలు సానుభూతి వ్య‌క్తం చేసి మ‌ద్ద‌తుగా నిలిచారు కానీ తెలంగాణ ఎంపీలు ఏనాడు ఒక మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న కూడా ఎందుకు చేయ‌లేదో కేటీఆర్ చెప్పారు. ఈ రోజున ఆంధ్రుల ఓట్లు కావాల్సి వ‌చ్చేస‌రికి అప్పుడు పాయ‌సం పెడ‌దాం అనుకున్నాం.. ఆ రోజున బిరియాని పెడ‌దాం అనుకున్నాం అంటూ క‌బుర్లు చెబుతున్నారు కేటీఆర్‌.

About admin

Check Also

ముకేశ్‌ మ్యాజిక్‌!

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానం దక్కింది. గత ఏడాది (19వ స్థానం)తో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *