Home / Narasarao Peta / కోటప్పకొండ క్షేత్రం

కోటప్పకొండ క్షేత్రం

భక్తులు ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం కోటప్పకొండ. గుంటూరు జిల్లాలో నర్సరావు పేట కు 13 కి.మీ దూరంలో ఉంది. అతి పురాతన చారిత్రక నేపధ్యం కలిగిన కోటప్పకొండ ఆలయ చరిత్ర అందరు చదవండి.మన భావి తరాలకు చెప్పవలసిన భాధ్యత పల్నాటి ప్రజలు గా మన పై వుంది. ఇక్కడ ప్రధాన ఆలయం 1,500 అడుగుల ( 460 m) ఎత్తులో ఉంది. కొండ పాదాల వద్ద ఉన్న గ్రామం పేరు కోటప్పకొండ అని పెట్టారు. దేవాలయం దగ్గర నిలుచుంటే చుట్టూ రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు పెద్దపెద్ద శిఖరాలు కనిపిస్తాయి. త్రిమూర్తులు పేర్లతో ఉన్న ఈ మూడు కొండల ప్రాంతాన్ని త్రికూటచలంగా పిలుస్తారు.కోటప్పకొండ కంటే ఎత్తున వుండే రుద్ర శిఖరం మీద ఒక చిన్న దేవాలయం కూడా వుంటుంది. దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు పార్వతి దేవి దూరం కావటం వల్ల విరక్తితో ఈ కొండ ప్రాంతంలో 12 సం:ల బాలుడి గా తపస్సు చేయ నారంభించెను, 11 వ శతాబ్దంలో కొండ క్రింద భాగంలో పాలెంకయ్య అను శివభక్తుడు ఉండేవాడు. అప్పట్లో రుద్ర శిఖరం మీద శివుడు నివశిస్తున్న కారణంగా ఒక శివలింగం ఉండేది. పాలెంకయ్య నిత్యం ఆ శివలింగం ను కొలిచేవాడు.అతడు భోగ భాగ్యలతో ఉండేవాడు రోజూ దేవుడికి ప్రసాదం పెట్టి వచ్చేవాడు.ఆయన భక్తి కి మెచ్చి శివుడు జంగమ దేవర రూపంలో ఒకరోజు దర్శనం ఇచ్చాడు.తన ఇంటికి భోజనానికి రమ్మని పిలువగా రూపంలో ఉన్న శివుడు అతడి ఇంటికి వెళ్లి పాల అన్నం స్వీకరించి ఆశీర్వదించి వస్తాడు.మరుసటి రోజు నుండి ఆ జంగమ దేవర కనిపించడు.అయినను రోజూ పాలెంకయ్య శివలింగంకు పూజ చేస్తూనే వున్నాడు.ఇదే క్రమంలో కొండ కు దక్షిణాన ఉన్న కొండకావూరు అనే గ్రామంలో ఆనందవల్లి అనే గొల్లభామ పరమ శివభక్తురాలు విభూతి,రుద్రాక్షలు ధరించి,శివస్తోత్రాలు పాడుతూ కొండ మీద కు వెళ్లి రోజూ శివలింగం ను దర్శించేది.,ఆమె ప్రతి రోజు స్వామి కి పండ్లు,పాలు నైవేద్యంగా ఇచ్చేది. ఒకరోజు శివునికి అభిషేకం చేయుటకు కుండలో నీరు తెచ్చి,శివలింగం వద్ద పెట్టి మారేడు దళం లకై వెళ్లినది,ఇంతలో ఒక కాకి నీఉ ఉన్న కుండ ను ను తగిలి నీరు ఒలకబోసింది.ఆనందవళ్లి కోపోద్రేకంతో ఈ ప్ర్రాంతంలో కాకులు తిరగకుండు గాక!అని శాపం ఇచ్చిందట,అక్కడి నుండి ఇక్కడ కాకులు కనపడవని చెపుతారు,రోజూ ఈమె చేసే భక్తి కి మెచ్చి జంగమ దేవర రూపంలో దర్శనం ఇచ్చి జ్ఞానోపదేశం చేస్తాడు.రోజు ఈ కఠిన మైన కొండ ఎక్కి రావద్దని,పెళ్లి కూడా కాని నువ్వు ఇలా సాహసించ వద్దని,ఇంటి వద్దనే పూజ చేసుకోమని ఆనందవల్లిని జంగమ దేవర వారిస్తాడు.కాని ఆనందవల్లి జంగమ దేవర మాట వినక రోజూ వచ్చి జంగమదేవరకు,శివలింగంకు పూజ చేస్తూనే వుంది.ఆమెను ఎలాగైనా ఈ కొండ ప్రాంతానికి రానివ్వ కుండా ఆపాలని పెళ్లి కాని కి కృత్రిమ గర్బం దాల్చేటట్లు చేస్తాడు,అయినను ఆమె కష్టపడు తూ,వస్తూనే వుంటుంది.తుదకు జంగమ దేవర, ఆనందవల్లి ని ఇక నువ్వు ఈ కొండ కు రావద్దు నీకోసం నేనే కిందకు వస్తాను పద,కాని నువ్వు వెనుకకు తిరిగి చూడకు అని చెప్పి, అంటూ ఆమె వెంట రుద్ర రూపంలో ఉన్న పరమశివుని ఆకారంలో కొండ దిగుతూ నడుస్తున్నాడు, ఆనందవల్లి కొంత దూరం కొండ దిగాక,నిబ్బరంకోల్పోయి వెనుకకు తిరిగి చూసింది.పరమశివుని రూపం చూసి తన్మయంపొందింది.శివుడు ఆమెకు తాను చెప్పినా వెనుకకు తిరిగి చూసిన కారణంగా తాను కొండ దిగి రానని, చెప్తూ,అక్కడే గల బిలంలో శివలింగ రూపంలో వెలుస్తాడు,ఆప్రదేశమే నేడు స్వామి వెలసిన ప్రాంతం.,ఆనందవల్లికి మోక్షం ప్రసాదిస్తాడు. పాలెంకయ్య పూజ కొరకు వచ్చి చూడడా బిలంలొ ఒక శివలింగం వెలవటంచూసి ఆశ్చర్యపోతాడు,అంతలో శివుడు ప్రత్యక్షమయి,మీ ఇంట విందు ఆరంగించింది తనేనని,అలాగే ఆనందవల్లి వ్రత పూర్తి అయినందున ఆమెకి మోక్షం ప్రసాదించాన్నని చెప్పి,ఈ ప్రాంతంలొ ఒక దేవాలయం నిర్మించమని చెపుతాడు, అలాగే ఆనందవల్లికి నా దేవాలయ క్రింద భాగంలో ఆమె విగ్రహంచేయించి దేవాలయం కట్టు అని చెపుతాడు,మెదట ఆమె ను దర్శించిన తర్వాతనే నన్ను భక్తులు దర్శిస్తారు అని చెప్పి,పరమ భక్తులయిన పాలెంకయ్య,ఆనందవల్లి చరిత్ర కూడా కలకాలం నిలిచిపోతుందని దీవించి శివుడు అంతర్దానం అయ్యాడు. ప్రతీతి..పాలెంకయ్య వెంటేనే ఆ ప్రాంతంలో ఆలయాలు నిర్మించి ఉత్సవాలు చేయ ప్రారంభించాడు. క్రమేణా ఈ ఆలయానికి భక్తులు సంఖ్య పెరిగింది.కొండ వీడు ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వారు స్వామిని దర్శించి విలువైన కానుకలు ఇచ్చి,కొండ కావూరు గ్రామాన్ని దేవుని మాన్యంగా రాసి ఇచ్చారు. కులోత్తుంగ చోళుని శిలాశాసనం తేదీ 1172 AD ద్వారా ఈ ఆలయ చరిత్ర తెలుపుతుంది . 1761లో ఈ ప్రాంతాన్ని పాలించిన గుండారాయలు అనే రాజు కోటప్పకొండ మీదకి 703 మెట్లతో మెట్లమార్గాన్ని ఏర్పాటు చేయించారు. ఇచ్చారు.ఈ దేవాలయానికి వెళ్లేదారి మలుపులతో పచ్చని చెట్లతో నయనాందకరంగా ఉంటుంది.ప్రతి మలుపులో ఆకట్టుకునే దేవతా మూర్తుల విగ్రహాలు,అతి పెద్ద విఘ్నేశ్వర,చతుర్ముఖ బ్రహ్మ,శేషసాయి తల్పంపై శయనించే శ్రీ మహావిశ్ణువు,మరియు ఆది శక్తి రూపిణులు అయిన పార్వతి,లక్ష్మీదేవి,సరస్వతి ల విగ్రహాలు తో బాటు ప్రత్యేక ఆకర్షణ గా త్రిముఖ శివ విగ్రహం,మరియు కాళింది మడుగు లో సర్పం పై నాట్య మాడుతున్న చిన్ని కృష్ణుడు ప్రతిమలు అబ్బురపరుస్తాయి.వింత లోకంలో విహరింప చేసి భక్తి భావం పెంచుతాయి. సర్పం పై నాట్య మాడుతున్న చిన్ని కృష్ణుడు ప్రతిమలు అబ్బురపరుస్తాయి.వింత లోకంలో విహరింప చేసి భక్తి భావం పెంచుతాయి.ఈ కొండ పై స్వామి వారిని కోటి మంది దేవతలు పూజించారని ఆగస్త్య మహాముని చెప్పినట్లు ఆధారాలున్నవి.ఈ ఆలయ గాలి గోపుర కుడి వైవున నవగ్రహ ఆలయం ఉంటుంది.యజ్ఞశాలలో యాగాలు చేస్తారు.ఆలయ ప్రాంగణంలో ఈ ఆలయ ఆవిర్బావ చరిత్ర తెలిపే చిత్రాలు ఉంటాయి.ఆలయాన కుడి వైపు కొండ పై నాగేంద్ర స్వామి ఆలయం ఉంటుంది.ఇక్కడ గల పుట్ట కు ప్రదక్షిణ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెపుతారు. పరమశివుడు బ్రహ్మాచారిగా దక్షిణామూర్తి గా తపసు చేసి బహ్మ,విష్ణు లకు బ్రహ్మోహదేశం చేసిన అతి పవిత్ర ప్రాంతం కాబట్టి,ఇక్కడ వివాహ ఉత్సవాలు చేయరని పెద్దలు చెపుతారు. ఈ దేవాలయం లొ స్వామి వారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివరాత్రి కి ఇక్కడ జరిగే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.విధ్యుత్ దీపాలతో ప్రతి గ్రామం నుండి ప్రభలు కట్టి తెస్తారు.రోడ్డు మార్గం ఉన్నను,చాలా మంది మెట్ల మార్గం గుండా నడచి శివరాత్రి కి ఇక్కడ జరిగే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.విధ్యుత్ దీపాలతో ప్రతి గ్రామం నుండి ప్రభలు కట్టి తెస్తారు.రోడ్డు మార్గం ఉన్నను,చాలా మంది మెట్ల మార్గం గుండా నడచి స్వామి వారిని దర్శిస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు హరహర కోటయ్యా,చేదుకో కోటయ్య అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలతారు. మాఘ మాసం లో ఈ దేవాలయ ప్రాంతంలో గోవులను ప్రదక్షిణ చేయిస్తే మంచి జరుగుతుందని పెద్దలు చెపుతారు. కృష్ణానది కి దక్షిణాన యల్లమంద కొండ,కావూరురాళ్ల పర్వతం మధ్య ఈ దేవాలయం ఉండడాం చేత భక్తులు యల్లమంద కోటేశ్వర స్వామి గా కావూరి తికూటేశ్వర స్వామి గా కూడా పిలుస్తారు. స్వామి వారి ప్రధాన ఆలయం కు చేరుకునే ముందు ఆనందవల్లి అమ్మవారిని దర్శిస్తే మన భాధలు ఆమె స్వామి వారితో చెప్తారని ప్రతీతి. ఓం నమశివాయ: అనే శివనామం సలక పాపాల హరణం… ఈ ప్రాంతం,ఈ దేవాలయం కొత్తగా చూసేవారు ఇదో అద్బుత లోకం అనుకొంటారు.అంత రమణీయ ప్రకృతి దృశ్యాల ఇక్కడ వుంటాయి.

రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల.పోన్:8125470031

About admin

One comment

  1. Nice site sir for providing such a good information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *