Home / History / కన్నమదాసు

కన్నమదాసు

1100 శతాబ్దం లో మాచర్ల సేన లకు సర్వ సైనాని గా భాద్యత నిర్వర్తించి, బ్రహ్మనాయుడికి నమ్మిన బంటు గా కడవరకు నిలిచి చరిత్ర లో, పల్నాటి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిన మహా వీరుడు కన్నమదాసు చరిత్ర:
పల్నాటి చరిత్రలోను,యుద్దంలోను గొప్ప ఖ్యాతి పొందిన మాహాయోధుడు కన్నమ దాసు గురించి తెలుసుకుందాం. కన్నమదాసు తండ్రి తెప్పల నాయన్న,తల్లి పెమ్మసాని.చిన్నప్పటి నుండే కన్నమదాసు కు పట్టుదల,వీరత్వం,భయపడని గుణం తల్లి,తండ్రులు నేర్పారని చెపుతారు. పల్నాటి చరిత్ర మనకు మొదటి గా తెలిపిన శ్రీనాధ కవింసార్వభౌమ(ఆయన కాలం 1365-1441) తన పల్నాటి వీరచరిత్ర గ్రంధం లో కన్నమ దాసు అరివీర భయంకరుడుని,మహా వీరుడని తెలిపారు. ఆ రోజుల్లో కన్నమదాసు ను కన్నమనీడు,రాజామాల కన్నమ దాసు అని,గోసంఘి కన్నమ అని మూడు పేర్ల తో ప్రజలు పిలిచేవారటని తెలిపారు. 1170 సంవత్సర ప్రాంతం లో కారంపూడి లో జరిగిన పల్నాటి యుద్దం,పల్నాటి వీరుల వీరత్వం గురించి వారి తదనంతరం మహాదేవి చర్ల(మాచర్ల),గురజాల,కారంపూడి ప్రజలు బుర్రకధల రూపం లోకధల రూపం లో చెప్పుకోవటం చూసి అప్పట్లో 15 వ శతాబ్దం లో పల్నాటి ప్రాంతం పక్కనే కొండవీడు రెడ్డి రాజుల వద్దా ఆస్తాన కవి గా ఉన్న శ్రీనాధుడు ఉత్తేజితుడై పల్నాడు లో పలు ప్రాంతాలు తిరిగి పల్నాటి చరిత్ర గురించి పరిశోధనలు చేసి పల్నాటి వీరచరిత్రగ్రంధం రచించారు. అప్పట్లో శ్రీనాధుడు మండాది,అలుగురాజుపల్లి,కారంపూడి,గురజాల.మహాదేవిచర్ల(మాచర్ల) ఇలా అనేక గ్రామాలూ తిరిగి పెద్దల నుండి తమ ముందు తరాల వారు చెప్పిన విషయాలు, పల్నాటి వీరుల చరిత్ర తీసుకుని గ్రంధం రాసారు.అప్పటి ప్రజలు పల్నాటి వీరులుబ్రహ్నన్న,కన్నమ,నాగమ్మ,బాలచంద్రుల ప్రతాప,పౌరుషాల గురించి తెలుసుకుని గొప్పదనం ,శౌర్యం గురించి శ్రీనాధునికి తెలియ చేయగా ఆయన తన గ్రంధం లో పల్నాటి లో పుట్టిన చెట్ల కు కూడా చేవ ఉంటుందని,ఈ ప్రాంతం వారు గొప్ప పరాక్రమం,పౌరుషం కలవారని రాసారు,అందుకేనేమో ఇప్పటికి పల్నాడు అంటే పౌరుషాగ్నికి ప్రతీక గా చెపుతారు.
మనం అందరం బాహుబలి సినిమా చూసే వుంటాం దానిలో కట్టప్ప అని మహా సైన్యాని ఉంటాడు,మహా బలవంతుడు.రాజు మరియు రాజ్యం పట్ల అతి విశ్వాసపాత్రుడు గా ఉంటాడు.ఒక్క మాటలో చెప్పాలంటే 100 మంది కట్టప్ప ల ధీరత్వం,విశ్వాసం కలిగిన గొప్ప మహావీరుడు కన్నమదాసు. నడిచే అగ్నికణం,విశ్వాసానికి మారు పేరు,భయం అంటే తెలియని ధీరోత్తముడు, కన్నమదాసు.పల్నాడు లో బ్రహ్మానాయుడు చాపకూడు ద్వారా అన్ని కులాలను ఏకం చేసి మాచర్ల శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం లో అందరు కలసి భోజనం చేయించటం చూసి ఉత్తేజితుడై బ్రహ్మనాయుడు కి అండగా కడవరకు నిలిచిన గొప్ప ధీరుడు. క్రీ.శ.1170 లలో నే బ్రహ్మానాయుడు బహుజన కులనికి చెందిన కన్నమదాసు కు మాచర్ల ప్రాంత సర్వ సైన్యాని పదవి ఇచ్చి గౌరవించాడు.పౌరుషానికి,ధైర్యసాహసాలకు కులం అడ్దు గోడ కాదని మనపల్నాటి చరిత్ర ఆనాడే తెలిపింది.ఆరోజుల్లో అగ్ర వర్ణాల వారే సర్వ సైన్యాని,ఇతర ముఖ్య పదవుల్లో ఉండేవారు,అన్ని కులాలు,మతాలు ఒకటే అని బ్రహ్మన్న గారిని ఎందరు విమర్శించినా కన్నమ దాసు పౌరుషం,వీరత్వం చూసి మాచర్ల సర్వ సైన్యాని పదవి ఇచ్చి గౌరవించారు బ్రహ్మన్న గారు.,కన్నమదాసు కి పదవి ఇచ్చి తన జీవిత పర్యంతం కన్నమదాసు ను సొంత సోదరుడు గా చూసెను.కన్నమ దాసు కూడా బ్రహ్మన్న గారి అడుగు జాడల్లో నడుస్తూ గొప్ప వీరుడు గా పేరు పొందాడు. అంధుకేనేమో అలనాటి నుండి కూడా మన పల్నాటి ప్రాంతం లో అన్ని పండుగలు,అన్ని,కులాలు,మతాలు వారి కలసి జరుపుకుంటాము,అలాగే మాచర్ల చెన్నుని తిరునాళ్ల ఉత్సావాలు,రధయాత్ర ను అన్ని కులాలు మతాలు వారి కలసి రధం లాగూతూ పల్నాటి ప్రజలంతా ఒకటే మాకు కుల,మత భేధాలు లేవు అని ఇప్పటికి ప్రపంచానికి చాటుచున్నారు. , కన్నమదాసు కదన రంగంలో కి వస్తే శత్రు సైన్యం లక్షమంది ఉన్న చెమటలు పట్టేవట, యుద్దరంగాన ఆయన గుర్రం పరుగెత్తే గిట్టల శబ్దం కూడా శత్రువులను భయకంపింతులను చేసేది,దేవుడా ఆ మహావీరుడు మా వైపుకాక మరో వైపు వెల్లేలా చూడు అని కోరుకునేవారట. ఈయన కత్తి తో చేసే వీరవిహారం చూసే శత్రు రాజులు ఈయనకు ఎదురు కాకుండా తప్పించుకునెడివారట.పల్నాటి యుద్దంలో గొప్ప వీరులు బాలచంద్రుడు లాంటి మహావీరులు మరణించినను, కన్నమదాసు సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న గారి సహకారంతో నాగమ్మ ను ఓడించి మాచర్ల కు విజయాన్ని చేకూర్చాడు. కన్నమ దాసు రాజాజ్ఞ ను పాటించటం లో గొప్ప విధేయుడని,అత్యంత సమయస్పూర్తి గలవాడని అనేక క్లిష్ట సమయాల్లో చతురత తో వ్యవహరించి మాచర్ల పాలకులను కాపాడారని ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు రాసిన పల్నాటి వీరచరిత్ర పుస్తకం లో కన్నమదాసు ను వర్ణించారు. కన్నమ దాసు వాడిన ఆయుధాలు ఇతర ఏ వీరులు వాడలేదని ఆయన చేతిలో భయంకర ఖడ్గం ఉండేదని,దాని బరువు అధికమని ఆయనను దగ్గర నుండి చూస్తేనే శత్రువుల కు పై ప్రాణాలు,పైనే పోయేవని అంతటి గొప్ప వీరుడు పల్నాడు ప్రాంతం లో పుట్టటం ఒక చరిత్ర సృష్టించటం,ప్రజలు ఆయనను ఇప్పటికి గుర్తుంచుకోవటం గొప్ప విషయమని పల్నాటి చరిత్ర పై పరిశోధన చేసి ఎధిక్ ఆఫ్ పల్నాడు అనే పరిశోధన గ్రందాన్ని రచించిన రోగోర్ అనే విదేశీ చరిత్ర కారుడు తెలిపారు.అలాగే బ్రహ్మన్న కు శత్రువుల నుండి కలిగే ముప్పును కూడా అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడే వాడని,కన్నమ దాసు పక్కన ఉండగా బ్రహ్మనాయుడు ని ఎవరు ఏమి చేయలేరనే నానుడి అప్పట్లో ఉండేదని తెలిపాడు.
ఏ చరిత్ర లో అయినను రాజుల కు చరిత్ర ఉంటుంది.ఒక సైన్యాని కి ఇంత పేరు ప్రతిష్టలు రావటం,మరియు ఆయన విగ్రహాలు కూడా చేసి గౌరవించి చేసేలా మన చరిత్ర లో స్తానం సంపాదించుకున్న కన్నమ దాసు చరిత్ర మన ప్రాంతం ఎన్నడు మరువదు.భావి తరాలకు కూడా ఆయన చరిత్ర నిలిపేందుకు, చెప్పేందుకు ఆయన విగ్రహాలు కూడా కట్టించి గౌరవించిన గొప్ప పౌరులు మన పల్నాటి ప్రజలు.ఒక వ్యక్తి ని గౌరవిస్తే ఎంతగా మన పల్నాడు ప్రజలు గుండెల్లో పె ట్టు కుంటారో ఒక ఉదాహరణ యే మన వీర కన్నమదాసు. కారంపూడి వీరుల గుడి ప్రాంగణంలో కన్నమదాసు మేడ మరియు ఆయన వాడిన ఆయుధాలు కూడా ఉన్నాయి. మాచర్ల ప్రధాన సెంటర్ లో కూడా కన్నమదాసు విగ్రహం పెట్టి ప్రజలు శాశ్వత గౌరవం కల్పించేలా చేసారు. తనను నమ్మి,గౌరవించి సర్వసైన్యాని పదవి ఇచ్చి న బ్రహ్మానాయుడు కు మన చరిత్ర లో ఎంత పేరు ఉందో అంతే పేరు కన్నమదాసు కి రావటం ఆయన శౌర్యపరాక్రమాలు,మరియు విశ్వాస గుణమే కారణం. చిన్న ఉదహరణ గా చెప్పలంటే,బాహుబలి చూసిన ప్రతి ఒక్కరు కట్టప్ప పాత్రను పొగడని వారు లేరు అంతపేరు ఆ పాత్రకు వచ్చింది.అలాగే మన పల్నాటి చరిత్రలో అంత గొప్ప పేరు సాధించుకున్న పరాక్రమశాలి,రణధీరుడు,గొప్ప విశ్వాసపాత్రుడు,బ్రహ్నన్న గారి అడుగు జాడల్లో నడుస్తూ,కడవరకు ఆయకు బాసట గా నిలిచిన ధీరోత్తముడు. మన కన్నమ దాసు ను మనమంతా గుర్తుంచుకుని , మన భావితరాలను ఆ మహావీరుడు చరిత్ర నిలిపేలా , మన పల్నాటి చరిత్ర ను పల్నాటి ఖ్యాతి ని మనం అందరం కాపాడి భావి తరాల వారికి అందించేలా ప్రతి పల్నాటి పౌరుడు కృషి చెయ్యాలని ఆశిద్దాం. రచయిత వేముల శ్రీనివాసరావు మాచర్ల.పోన్:8125470031

About admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *