హైదరాబాద్ లో వింత వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటే రాత్రి సమయాల్లో చలిగా ఉంటోంది. ఈక్రమంలో రెండు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే 2.2 డిగ్రీలు తగ్గిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి.
తాజాగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు 14.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మొదలవుతున్న చలి రాత్రి సమయాల్లో తీవ్రంగా మారుతోంది. అదే మధ్యాహ్న సమయంలో నార్మల్ కంటే 2.2 డిగ్రీలు పెరగడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.