Home / Entertainment / రెండుబాగాలుగా కార‌ణ‌జ‌న్ముని చ‌రిత పూర్తి వివ‌రాలు..

రెండుబాగాలుగా కార‌ణ‌జ‌న్ముని చ‌రిత పూర్తి వివ‌రాలు..

విశ్వ‌విఖ్యాత నటుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా క్రిష్ డైరెక్ష‌న్‌లో `ఎన్టీయార్` బ‌యోపిక్ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో విద్యాబాల‌న్, రానా, సుమంత్‌, నిత్యా మీన‌న్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోందని ఇంత‌కుముందు స‌మాచారం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఎన్టీయార్ సినీజీవితం నేప‌థ్యంలో మొద‌టి భాగం, రాజకీయ జీవితం ఆధారంగా రెండో భాగం తెర‌కెక్కనున్న‌ట్టు వార్త వ‌చ్చింది. ఆ విష‌యాన్ని డైరెక్ట‌ర్ క్రిష్ తాజాగా ధ్రువీక‌రించారు. తొలి భాగం సినిమాను `ఎన్టీయార్ క‌థానాయ‌కుడు` పేరుతో విడుద‌ల చేయ‌బోతున్నారు. `ప్ర‌తీ క‌థ‌కీ ఓ నాయ‌కుడుంటాడు. కానీ, క‌థ‌గా మారే నాయ‌కుడొక్క‌డే ఉంటాడు` అని పేర్కొంటూ ఓ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ క్రిష్ అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 9వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇక‌, రాజ‌కీయ జీవితం ఆధారంగా తెర‌కెక్క‌నున్నప్ర‌జానాయ‌కుడు సినిమా కూడా రెండు, మూడు వారాల వ్య‌వ‌ధిలోనే విడుద‌ల కాబోతుంద‌ని స‌మాచారం.

About admin

Check Also

ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఆడ్జెస్ట్ మెంట్ ఇలా చేస్తున్నారు..!!

అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *