Home / Entertainment / స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చాడా.. ఏంటి?

స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చాడా.. ఏంటి?

నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో.. క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రోజుకో కొత్త వార్తతో ఈ సినిమా సెన్సేషన్ అవుతోంది. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చిత్ర నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య.. సినిమాకు అన్నీ తానై చిరస్థాయిగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు.

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. తాజాగా ‘ఎన్టీఆర్’ పోస్టర్ విడుదల చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ వేషంలో కనిపిస్తున్న బాలయ్య బాబును చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. అరె! స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాడా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అచ్చం తండ్రి ఎన్టీఆర్ రూపంలో కనిపిస్తున్న బాలయ్యను చూసి మురిసి పోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతోంది.

About admin

Check Also

ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఆడ్జెస్ట్ మెంట్ ఇలా చేస్తున్నారు..!!

అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *