Home / Entertainment / ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా: నాని

ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా: నాని

‘‘నాగార్జునగారికి నటుడిగా నేనంటే ఇష్టం. అమలగారికి నేను మాట్లాడే తెలుగంటే ఇష్టం. ‘దేవదాస్‌’ సినిమా చేయడం వల్ల వాళ్లకు నా మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నా. సినిమా పూర్తయ్యాక రఫ్‌ ఎడిట్‌ చూసి నాగార్జునగారు నన్ను పిలిచి చెప్పిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. అంతకు ముందున్నదానికన్నా పదింతలు మార్కులు వేయించుకున్నట్టు అనిపించింది’’ అని అన్నారు నాని. నాగార్జునతో కలిసి ఆయన నటించిన ‘దేవదాస్‌’ గురువారం విడుదల కానుంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. అశ్వినీదత్‌ నిర్మాత. ఈ సినిమా గురించి నాని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు…
షూటింగ్‌ స్పాట్‌లో ఇంప్రూవ్‌ చేస్తే మరింత బాగా వచ్చే స్ర్కిప్ట్‌ ‘దేవదాస్‌’ది. అయితే స్పాట్‌లో అలాంటివి చేస్తే నాగార్జునగారు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని కాస్త ఆలోచించా. అయితే తొలిరోజు మధ్యాహ్నానికే ఆయన మాతో సరదాగా కలిసిపోయారు. పక్కా ప్రణాళిక ఉన్న వ్యక్తి ఆయన. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. స్పాట్‌లో చాలా డెవలప్‌మెంట్స్‌ చేశాం. ఆయన డాన్‌గా, నేను సిటీకి కొత్తగా వచ్చిన యంగ్‌ డాక్టర్‌గా నటించాం. కేవలం వినోదమే కాదు.. అన్ని అంశాలూ ఉంటాయి. అక్కడక్కడా నవ్విస్తుంది. అక్కడక్కడా మనసు బరువెక్కేలా చేస్తుంది. పతాక సన్నివేశాలు పూర్తయ్యాక ఫీల్‌ గుడ్‌ సినిమా చూశామన్న ఫీలింగ్‌ అందరికీ తప్పకుండా కలుగుతుంది.
‘సారీ’ చెబుదామనుకున్నా!
శ్రీధర్‌ రాఘవన్‌గారు కథ చెప్పినప్పుడు పాయింట్‌ బావుంది కానీ, ఆ కథ ఉన్నదున్నట్టు తీస్తే తెలుగు ప్రేక్షకులకు రుచించదు. ఏం చేయాలా? అని ఆలోచిస్తుండగా ‘శమంతకమణి’ ట్రైలర్‌ చూశా. వెంటనే శ్రీరామ్‌ ఆదిత్య గురించి తెలుసుకుని, అతని తొలి సినిమా ట్రైలర్‌ కూడా చూశా. పిలిచి నెల రోజుల్లో ఈ కథను తెలుగుకు తగ్గట్టు మార్చి తీసుకురమ్మన్నా. అతను చెప్పినట్టే చేశాడు. నిజానికి అతను వచ్చి కథ చెప్పే సమయానికి నేను చాలా బిజీగా ఉన్నా. కథ ఏమాత్రం ఫర్వాలేదు అని ఉన్నా.. ‘సారీ’ చెప్పాలని నిర్ణయించుకున్నా. కానీ కథ వినగానే చాలా బాగా నచ్చింది. నాగార్జునగారికి కూడా నచ్చింది. వెంటనే కాల్షీట్‌ అడ్జస్ట్‌ చేసుకుని చేశాం.
అశ్వినీదత్‌గారు ముందుంటారు!
అశ్వినీదత్‌గారితో ఈ చిత్రంతో అనుబంధం పెరిగింది. హీరోలను ఇంట్లో వ్యక్తులుగా చూస్తారాయన. సినిమా కోసం ఏం అడిగినా అంతకన్నా గొప్పదాన్ని తెచ్చి ముందుపెడతారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత నా ప్రతి సినిమానూ చూసి నాకు మొదటిరోజే నిజాయతీగా మెసేజ్‌ పెడతారు దత్తుగారు. నన్ను, నాగార్జునగారిని చూసి ‘గుండమ్మ కథ’లాంటి చిత్రమవుతుందని ఫిక్సయ్యారు. అలాగే నాగార్జునగారు కొన్ని సన్నివేశాలను బట్టి ఇది ‘మున్నాభాయ్‌’ తరహా సినిమా అవుతుందని అనుకున్నారు.
నేనేం బాధపడలేదు
‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాకు మిగిలిన అన్ని చిత్రాల్లాగానే చాలా కష్టపడ్డాను. కొత్త యాస నేర్చుకున్నా. అన్ని చేసినా ఎందుకో ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. స్ర్కిప్ట్‌ పరంగా ఇంకాస్త బాగా చేసి ఉండాల్సిందని నేనూ, గాంధీ అనుకున్నాం.
వాళ్ల దగ్గర కూడా ఉండదేమో!
మా ‘జర్సీ’ విజయదశమికి మొదలవుతుంది. చిత్ర నిర్మాతలు నాకు కంప్లీట్‌ క్రికెట్‌ కిట్‌ పంపించారు. రెగ్యులర్‌గా ఆడేవాళ్ల దగ్గర కూడా అంత పర్ఫెక్ట్‌ కిట్‌ ఉండదేమో. నేను ప్రతిరోజూ మూడున్నర గంటల సేపు ప్రాక్టీస్‌ చేస్తున్నా. నాకు సచిన్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో బ్యాట్స్‌మ్యాన్‌గా చేస్తున్నా. భవిష్యత్తులో టాలీవుడ్‌ క్రికెట్‌ షో జరిగితే.. నేనెంత పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నానో అందరికీ అర్థమవుతుంది.
ఎప్పుడూ లేదు
మూడున్నర నెలలుగా నేను ఉన్నంత బిజీగా ఇంతకు ముందు ఎప్పుడూ లేను. ఓ వైపు బిగ్‌బాస్‌. మరోవైపు ‘దేవదాస్‌’. ‘బిగ్‌బాస్‌’ చేశాక నేను చాలా మారాను. వ్యక్తులు, వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు.. ఇవన్నీ నాకు కొత్త విషయాలను నేర్పాయి. అంతా మంచే అనే ఒక బబుల్‌లో ఉన్న నాకు అంతకు మించిన జీవితం ఉంటుందని పరిచయం చేశాయి. ఈ వారాంతంలో ‘దేవదాస్‌’, బిగ్‌బాస్‌… రెండూ ఓ కొలిక్కి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

About admin

Check Also

ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఆడ్జెస్ట్ మెంట్ ఇలా చేస్తున్నారు..!!

అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *