Home / Entertainment / దీప్తి ది ఫేక్ ఓటింగా…. ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో కౌశల్ ఆర్మీ.

దీప్తి ది ఫేక్ ఓటింగా…. ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో కౌశల్ ఆర్మీ.

ఏదైనా జ‌ర‌గొచ్చు ఇది బిగ్ బాస్ షో టాగ్ లైన్..స‌రిగ్గా ఇదే జ‌రుగుతోంది ప్ర‌స్తుత సీజ‌న్ 2లో.. ఫైన‌ల్స్ కు చేరుతున్న స‌మ‌యంలొ ప‌రిస్తితులు ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులౌవుతున్నాయి. మరో వారం రోజుల్లో సెకండ్ సీజన్ ముగియనుంది. దీంతో ఇక బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారో అనే అంశంపై విశ్లేషణలు,చర్చలు జరిగిపోతున్నాయి.

ఇప్పటివరకూ ఓ లెక్క ,ఇకనుంచి ఓ లెక్క అన్నట్టు వోటింగ్ కూడా సాగుతోంది. ఈ వారం ఓటింగ్ ఆదివారం మొదలు కాగా, దీప్తి రాకెట్ స్పీడ్ తో ఓటింగ్ లో దూసుకెళ్తోంది. ఈమెకు అత్యధిక ఓట్లు నమోదవుతున్నట్లు ట్రెండ్ చెబుతోంది. భారీ ఓటింగ్ తో బాగా అగ్రస్థానంలో దీప్తి దూసుకుపోతుంటే ఆతర్వాత కౌశల్,గీతా మాధురి,తనీష్ , సామ్రాట్ ఉన్నారంటే అందరికీ ఆసక్తి కల్గిస్తోంది. ఇక గ్రాండ్ ఫినాలేకి చేరిన సామ్రాట్ ఓట్ల పరంగా చిట్టచివరి స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకూ ఓట్ల పరంగా ముందంజలో ఉంటూ వచ్చిన కౌశల్ ఈ వారం ఎందుకో ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు.

సగటు ప్రేక్షకుడు ఓటింగ్ కి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కౌశల్ గెలుపు గురించి కౌశల్ ఆర్మీ చూసుకుంటుందిలే అని చాలామంది ఓట్ చేయడం లేదు. ఈసారి కి తాము ఓటువేయకపోతే ఇంకొకళ్ళు వేస్తారులే అనే ధోరణి కనిపిస్తోందని క్రిటిక్స్ అంటున్నారు. దీనివల్లనే కౌశల్ కి ఓట్లు తగ్గిపోయాయని,కౌశల్ ఆర్మీ 2కె వాక్ లపై శ్రద్ధ చూపిస్తూ ఓట్లు విషయంలో నిర్లిప్తంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇదే కొనసాగితే గ్రాండ్ ఫినాలేలో నిరాశ తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే దిప్తీది ఫేక్ ఒటింగ్ అని కౌశ‌ల్ ఆర్మి విమ‌ర్షిస్తొంది. మ‌రి ఈ విమ‌ర్ష‌ల‌కు పుల్ స్టాప్ ప‌డి ఫైన‌ల్ లొ విజేతగా నిలిచేదెవ‌రో తెలియాలంటే మ‌రికొంత స‌మ‌యం ఆగాల్సిందే.

 

About admin

Check Also

ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఆడ్జెస్ట్ మెంట్ ఇలా చేస్తున్నారు..!!

అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *