Home / Entertainment / కౌశల్ తీరుపై …రచ్చ చేసిన భాను..

కౌశల్ తీరుపై …రచ్చ చేసిన భాను..

బిగ్ బాస్ ఇది మాములు షో కాదు..అలాంటి ఇలాంటి షో కూడా కాదు…రాత్రి రొమాన్స్ కాస్త పట్టపగలే సాగుతుంది.గురువారం నుంచి సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో గురువారం కూడా ‘మంచి – చెడు’ల టాస్క్ కొనసాగింది. గార్డెన్ ఏరియాలోని యాపిల్ మొక్కను కాపాడటం, జైల్లో బంధించడంలో భాగంగా ఇరువర్గాల మధ్య గట్టిపోరే జరిగింది. ఇది చివరికి.. క్యారెక్టర్లు గురించి పోట్లాడే వరకు చేరింది.

ముఖ్యంగా కౌశల్, భానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తేజు జైలుకు వెళ్లడంతో టాస్క్ ముగిసింది.టాస్కులో భాగంగా మంచి టీమ్‌కు చెందిన రోల్ రైడా, దీప్తీ, దీప్తీ సునైనాలను జైల్లో వేసేందుకు చెడ్డ టీమ్ విఫలయత్నం చేసింది. అలాగే, మంచి టీమ్ సైతం తేజస్వీని జైల్లో పెట్టేందుకు ప్రయత్నించారు. మరోవైపు భాను యాపిల్ చెట్టుపై నల్ల యాపిల్స్‌ను కాపాడేందుకు చెట్టుకు రక్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా దీప్తీ వారిని చెట్టు నుంచి విడిపించేందుకు ప్రయత్నించడంతో భాను-దీప్తీల మధ్య మాటల యుద్ధం జరిగింది.భాను పట్టుకున్న యాపిల్స్‌ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ చేతులు తన చెస్ట్‌కు తగిలాయంటూ రచ్చ చేసింది. అతడి క్యారెక్టర్ అలాంటిదంటూ భాను, తేజస్వీలు కౌశల్‌ను తిట్టిపోశారు.

ఈ విషయాన్ని రచ్చ చేయాలని ప్రయత్నించారు. అయితే, కౌశల్ యాపిల్ తీసేప్పుడు అక్కడే ఉన్న గీతా మాధురీ.. వారిద్దరు చేస్తు్న్న ఆరోపణలను వ్యతిరేకించింది. కౌశల్ ఉద్దేశపూర్వకంగా భానును తాకలేదని, యాపిల్‌ను తీయడానికే ప్రయత్నించాడని గీతా తెలిపింది. ‘‘ఆటను ఆటలా ఆడండి. క్యారెక్టర్ల జోలికి వెళ్లొద్దు’’ అని తేజస్వీ, భానులకు క్లాస్ పీకింది గీతా. చివరికి భాను.. కౌశల్ తనను కావాలని తాకలేదని ఆమె వివరణ ఇచ్చుకోక తప్పలేదు. బిగ్‌బాస్‌కు కూడా భాను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. చివరికి భాను.. కౌశల్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పింది.హైలెట్ అవ్వడానికి బిగ్ బాస్ గేమ్ షో కాస్త డ్రామా షోగా మారింది…

About admin

Check Also

కోచ్ కోర్కె తీర్చమన్నాడు.. నేనూ వేధింపులకు గురయ్యా : మిథాలీ రాజ్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మౌనంవీడారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో తాను ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులపై నోరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *