Home / Entertainment / మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్న అరవింద సమేత..!!

మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్న అరవింద సమేత..!!

అరవింద సమేత తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతున్నది. దసరా సెలవుల సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో హిట్ కొట్టడమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ సినిమా రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నది. అందులో ఒకటి ప్రపంచ వ్యాప్తంగా అరవింద సమేత రూ.150 కోట్ల గ్రాస్ ను సాధించింది. లాంగ్ రన్ లో మరో వంద కోట్లు వసూలు చేసే అవకాశలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెండో రికార్డ్ ఏమంటే.. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అరవింద సమేత 12 రోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేసింది. ఇది ఎన్టీఆర్ సినిమాల్లో రికార్డ్ అని చెప్పొచ్చు. బాహుబలి 2, రంగస్థలం, బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు ఇప్పటివరకు ఈ ఫీట్ ను సాధించాయి. ఇప్పుడు వాటి పక్కన ఎన్టీఆర్ అరవింద సమేత కూడా చేరిపోయింది. 12 రోజుల్లో ఈ సినిమా 1,01,967 రూపాయలు కలెక్ట్ చేసింది.

About admin

Check Also

అభిమానులకు అద్దిరిపోయే షాక్ ఇచ్చిన బాలయ్య : జోష్ లో నందమూరి అభిమానులు

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *