Home / Entertainment / అభిమానులకు అద్దిరిపోయే షాక్ ఇచ్చిన బాలయ్య : జోష్ లో నందమూరి అభిమానులు

అభిమానులకు అద్దిరిపోయే షాక్ ఇచ్చిన బాలయ్య : జోష్ లో నందమూరి అభిమానులు

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఊపుతో బయోపిక్‌ల హవా మొదలైంది. దివంగత నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. వెండితెరపైనే కాకుండా తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకూ ‘యన్‌.టి.ఆర్’ అని ఈ సినిమా పేరును ప్రచారం చేయగా.. దానికి కథానాయకుడు అనే క్యాప్షన్ తగిలించారు. టైటిల్‌ను ఎన్టీఆర్ కథానాయకుడిగా మార్చడాన్ని బట్టి రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. రెండో భాగానికి యన్.టి.ఆర్ ప్రజానాయకుడు అని టైటిట్ పెట్టినట్టు తెలుస్తోంది.

మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. రాజ‌కీయ సంద‌డి మొద‌ల‌యిన త‌ర్వాత మువీ విడుద‌ల కాబోతోంది. ఎన్నిక‌ల ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌డంతో రాజ‌కీయంగానూ ప్ర‌భావితం ఖాయం. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడి జీవిత చ‌రిత్ర‌ను,ప్ర‌స్తుత టీడీపీ ఎమ్యెల్యేగా ఉన్న ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ తెరకెక్కిస్తున్న త‌రుణంలో ఈ బయోపిక్ మ‌రింత ఆస‌క్తిరేపుతోంది. త్వ‌ర‌లో ఈ సినిమా శ్రీకాకుళంలో కీలక షెడ్యూల్‌ను జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఆ వెంట‌నే కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో కూడా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గబోతంది. ఎన్టీఆర్ కెరీర్‌లో కీలక ఘట్టంగా నిలిచిన పార్టీ ప్రచారంలో భాగంగా చైతన్యరథం సన్నివేశాలను శ్రీకాకుళంలో చిత్రీకరించనున్నారు. దివిసీమ ఉప్పెన స‌మ‌యంలో ఎన్టీఆర్ చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను కృష్ణా జిల్లాలో తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్ర‌ను స్వ‌యంగా బాలకృష్ణ పోషిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సినీవర్గాల్లో సంచలనం రేపుతోంది. అదేమంటే, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఎన్టీఆర్ బయోపిక్‌ను వివ‌రంగా చెప్పాల్సిన వ‌స్తుంద‌ని భావించిన దర్శక నిర్మాతలు, రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ 60 గెటప్పుల్లో కన్పిస్తారట. దాంతోపాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో కథను తొందరగా ముగించడం సాధ్యంకాదని దర్శకుడి ఆలోచన. దాంతోపాటు ఇటీవలే విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన రావడంతోపాటు బిజినెస్ వర్గాల్లోనూ సంచలనం రేపుతుండడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తే అటు బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లు అందుకోవచ్చని భావిస్తున్నారు. ఎన్ఠీఆర్ కథానాయకుడు కి తొలి భాగాన్ని జనవరి 9న, ఎన్ఠీఆర్ ప్రజానాయకుడు గా ఫిబ్రవరిలో రెండవ భాగాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.

About admin

Check Also

ఎన్టీర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఆడ్జెస్ట్ మెంట్ ఇలా చేస్తున్నారు..!!

అరవింద సమేత’ సక్సస్ మీట్ లో జూనియర్ బాలకృష్ణలను ఒకే వేదిక పై చూసిన తరువాత నందమూరి అభిమానులు జూనియర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *