Home / Devotional / అసలు అఘోరా అంటే అర్దం ఏమిటి?

అసలు అఘోరా అంటే అర్దం ఏమిటి?

అసలు అఘోరా అంటే అర్దం ఏమిటి?

Image result for aghora

అఘోరా అంటేనే ” భయరహిత” అని అర్దం ..
అపూర్వ శక్తి సమన్వితులా ?? సజీవ రహస్యాలు ఈ అఘోరాలు ???
మనం సహజంగా ఏమి చెప్పుకుంటూ ఉంటాము !
అంతా శివమయం , నీలో నాలో ఉన్నాడు పర్మేశ్వరుడు అని చెప్పుకుంటాము ..
అదే అద్వెతమ్ . మరి మనం అలా జీవిస్తున్నామా???
” శునకమును , శునక మాంసమును తినే వారిని ఒకేలా
చూస్తున్నామా . ? వారిలో శివుడిని చూడగలుగు తున్నామా .. ???
శుద్దమైన పదార్దాన్ని లేదా అశుద్దాన్ని ఒకేలాగా చూడగలమా ?
మందాకిని నదిని ముత్రాన్ని ఒకలా చూడగలమా ??
లేదు .. చెప్పగలము .. వినగలము … ఆ స్దాయికి మాత్రం ఎదగలేము ..
ఇది సత్యం ……… ఇది మాత్రమే సత్యం …. సత్యం …….
ఆ స్దాయికి ఎదగాలంటే ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలి …
కానీ ఆ స్దితిలో మనసా వాచా కర్మాణా జీవిస్తున్న వారు అఘోరాలు .. ఇది సత్యం …

”అరవింద్ అని జర్నలిస్ట్ 20 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేసి .
అఘోరాలపై ఎన్నో రీసెర్చ్ చేసి
కాశీ వెళ్ళి వారిని కలుసుకుని ”వారితో మాట్లాడి” వారితో ఇంటర్వూ అయిపోయిన తరువాత
వారికి సత్యం భోదపడి” అసలు నేను ఎవరిని ‘ ఎందుకు వచ్చాను . నేను వచ్చిన పని ఏమిటి ?
ఇన్ని ప్రశ్నలతో ” తానుకూడా ఓ గురువు ద్వారా అఘోరా దీక్షా తీసుకున్న
ఒకే ఒక్క తెలుగు వారు వీరు ..
వారు అఘోరాలు గురించి తెలిపిన విషయాలు ఎంతో ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి .
అఘోరాలు సత్య యుగం నుండి కూడా ఉన్నారట ..
ఈ అఘోరా అన్న పదం నమకాల్లో కూడా ప్రస్తావించబడి యున్నదట ..

అసలు అఘోరాల సందేశం ఏమిటి ? వీరి గురువు ఎవరు ?
ఇంకెవరు ” ఆదియోగి ” ఆ పరమేశ్వరుడే వీరి గురువు ” ……
కంటికి కనిపించే ఈ ప్రకృతి అంతా జగన్మాత , అందులో నిండి ఉన్న చైతన్యమే ఈశ్వరుడు ,
యావత్ సృష్టిలో ప్రతి ప్రాణిలో ఈశ్వరుడే …
ఆత్మ ఈ దేహాన్ని ఎంచుకున్నది .. కనుక లోపల దాగిన పరమేశ్వరునికే ఈ జీవితం అంకితం అనేది
వీరి యొక్క జీవిత లక్ష్యం ,, ఆశయం ,,
దేహంపై ఏవిధమైన బ్రాంతి లేదు .. భయం అంటే తెలియదు ” తెలిసింది ఒక్కటే నిర్బయమ్ ”’…
రేపటి గురించి ఆశాలేదు ” వీరు నిర్వహించే కపాలి పూజ కేవలం లోక కళ్యాణం కోసం ..
లొకా సమస్తా సుఖినోభవంతు అని నిరంతరం సంకల్పం చేస్తూ ఉంటారట …..
రోజు మొత్తంలో రెండు న్నర గంటలు మాత్రమే నిద్రపోతారట .. మిగతా సమయం సాధనలో గడుపుతారట ..

శివుడు శ్మశాన నివాసి అందుకే వీరికి శ్మశానం అంటే దేవాలయం ..
కాష్టంలో కట్టెలతో పూజ నిర్వహిస్తారు ..
పంచ భూతాలు అందరికి ఒక్కటే ” నింగి నేల నిప్పు నీరు గాలి అన్నీ …
ఇక ఆ నిప్పుకు ఈ నిప్పుకు భేధ౦ ఏమిటి అంటారు ?
వండిన పదార్ద౦ కు జీవం లేదు .. పోయిన ప్రాణిలో జీవం లేదు ..
రెండింటిలో ప్రాణం లేనప్పుడు ఏది తింటే ఏముంది ?
” కంటికి కనిపించేవి రెండే రెండు 1. జీవం 2. నిర్జీవం ..
జీవం ఉన్న ప్రతి ప్రాణిలో ఈశ్వరుని చూస్తాము ..
ఇక నిర్జీవం అయిన ఈ ప్రాణి అయినా ఒక్కటే ,,,
ధునిలో విభూది నీకు పవిత్రం ..
ఈ దేహం అనే దేవాలయంలో
సాక్షాత్తు పర్మేశ్వరునితో వసించిన ఈ దేహం కాలిపోతే ఆ విభూది మాకు అతి పవిత్రం అంటారు
దొరికితే ఆహారం దొరకకపోతే నిరాహారమ్ ” అది రోజులా నెలలా తెలియదు ”’
సాధన ద్వారా విశ్వం నుండి తీసుకున్న ప్రాణశక్తి మాకు ఆహారం అంటారు .. అదే సత్యం అందుకే వారు 500 ఏళ్ళు బ్రతికేస్తారు . మనం 50 ఏళ్ళు బ్రతికేస్తాము ..

దేహబ్రాంతి లేదు .. ఎండా వాన మంచు చలి అంతా ఒక్కటే …
సత్వ తమో రజో గుణం ఏది లేదు ఉన్నది ఒక్కటే నిర్గుణం ….
అదే శివ తత్వం

About admin

Check Also

తిరుమలేశుని కంటే ముందే ఆ స్వామికి నైవేద్యం…

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి నివేదించే నైవేద్యం మొదట శ్రీ వరాహమూర్తికి సమర్పించి తరువాతనే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎందుకు సమర్పిస్తారు? …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *