Home / Devotional / జులై 27న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం?

జులై 27న చంద్రగ్రహణం.. ఏ రాశుల వారికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం?

ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా జూలై 27 , 2018, శుక్ర వారమున గల చంద్ర గ్రహణము… కేతు గ్రస్తోదితము, ఖగ్రాస ఉత్తరాషాడ / శ్రవణ నక్షత్ర యుక్త చంద్ర గ్రహణము. అనగా సంపూర్ణ చంద్ర గ్రహణం కలదు. ఈ గ్రహణము మన దేశములో కనిపిస్తుంది. కావున ఇట్టి చంద్ర గ్రహణం మనకు వర్తిస్తుంది.

⭕👉 గ్రహణ సమయ వివరాలు :-

గ్రహణ స్పర్శ కాలము — రాత్రి 11. 54 ని॥లకు

గ్రహణ మధ్య కాలము — రాత్రి 01 : 52 ని ॥లు

గ్రహణ మోక్ష కాలము — రాత్రి 03 : 49 ని॥లకు

అంటే చంద్ర గ్రహణము రాత్రి 11 గం. 54 ని॥లకు ప్రారంభమయ్యి , రాత్రి 03 : 49 ని॥లకు ముగుస్తుంది.

ఇట్టి చంద్ర గ్రహణ పుణ్య కాలము మొత్తం 4 గంటల పాటు కలదు.

🔱 👉 ఏయే దేశాల్లో ఈ గ్రహణం ఉంది ? : మన దేశంతోబాటు, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ చంద్ర గ్రహణం కన్పిస్తుంది.

ఈ చంద్ర గ్రహణం గురించి సోషల్ మీడియాలో అనేక వదంతులు వినిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి అధమ ఫలము అని కొన్ని రాశులవారికి మధ్యమ ఫలం అని చూస్తున్నాము. నిజానికి ఇవన్నీ అపోహలే. ఈ ప్రపంచంలో అవే రాశుల్లో జన్మి౦చిన హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఏదైనా అశుభం అయితే అన్ని కోట్ల మందికి ఒకేవిధంగా అరిష్టం ఉంటుందా ఆలోచించాలి ? జాతకంలో తమ దశ విదశల గ్రహల స్థితి ని బట్టి మాత్రమే జాతక ఫలితాలు ఉంటాయి కానీ ఇలా గ్రహణం కారణంగా ఎలాంటి కీడు జరుగదు. అలాగే రాశి ఫలాలు కూడా !
కావున అన్ని రాశుల వారు ఎలాంటి భయానికి గురికావొద్దు అని హిందూ ధర్మచక్రం సూచిస్తుంది.

గ్రహణం సమయంలో అన్ని రాశులవారు తమకు ఉపదేశం ఉన్న మంత్ర జపం చేయడం ఉపదేశం లేని వారు శివ పంచాక్షరి, అష్టాక్షరి జపం చేసుకోవడం విశేషం. తద్వారా దైవ అనుగ్రహం లభిస్తుంది.
అనవసర అపోహలతో సమయము డబ్బు వృధా చేసుకోరాదు.
మీకు ఇక్కడ ఒక అనుమానం రావొచ్చు.
ఇలా ఫలానా రాశివారికి ఫలానా దానం చేయాలి అని మన పెద్దలు పంచాంగంలో రాసారు కదా అని ?

నిజమే ! సిద్ధాంతులు ఎప్పుడూ అసత్యము రాయరు. కానీ నేటి కాలంలో అల్ప మేధస్సుతో జనాల బలహీనతలను సొమ్ము చేసుకునే వారు ఎక్కువయ్యారు కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పంచాంగంలో చెప్పిన ప్రకారం ఏ రాశి వారికీ బాలేదో ఆ రాశివారు గ్రహణ సూచిత సమయంలో ఎక్కువ జపం చేసుకున్నా సరిపోతుంది.

⭕ 👉 గర్భిణీలు భయపడవద్దు

గ్రహణం అనగానే అధికంగా కంగారు పడేది గర్భిణీలు వారి తల్లి తండ్రులు. గ్రహణ సమయంలో ఎటూ కదల రాదు అని, ఒకే దిశలో పడుకొని ఉండాలి అని, కదిలితే గ్రహణ మొర్రితో పిల్లలు పుడతారు అనే వదంతులు చాలా ఉన్నాయి. నిజమే ! గ్రహణం లోని అతినీలలోహిత కిరణాల ( UVR ) ద్వారా సున్నితమైన శిశువు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని మన మహర్షులు చెప్పారు. ఆ దుష్ప్రభావం అత్యధికంగా సూర్య గ్రహణంలోనే ఉంటుంది కానీ చంద్ర గ్రహణం వలన అంతటి హాని కలుగదు కావున గర్భిణీలు ఎలాంటి భయమునకు లోను కాకుండా Normal గానే ఉండవచ్చు.
*అయితే గ్రహణ సమయంలో కిరణాలు పడకుండా జాగ్రత్త వహిస్తే సరి.

⭕ 👉 గ్రహణానికి ముందు ఏమీ తినరాదా ?

గ్రహణానికి ముందు తింటే దోషం అని అరిష్టం అని చెబుతుంటారు. మన మహర్షులు చెప్పిన పరిశోధనాత్మక విషయమే అది. సూర్య గ్రహణం వలన సంభవించే Ultra Violated Rays నిజంగానే అంతటి శక్తివంతమైనవి. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో కొన్ని సెకన్లు కనుక సూర్యుడిని చూస్తే మరు సెకన్ లో కంటి చూపు పోతుంది, వారి పరిశోధన శక్తికి మనం గర్వపడాలి.
అయితే ఆ సూత్రాలన్నీ మన మహర్షులు చెప్పిన కాలానికి సంబంధించినవే .( గ్రహణం విషయంలో ) అతి నీల లోహిత కిరణాలు (UVR ) వెనుకటి నివాసాలు అయిన గుడిసెలు పెంకుటిళ్ళ లోకి సులభంగా చేరేవి, ఆ కాలంలో విద్యుత్తు లేదు కనుక వెలుతురు ఇంట్లోకి రావడం కోసం ఇంటి చూరు కి అద్దాలు పెట్టేవారు. అలాగే ఇంటి నాభిస్తానంలో గచ్చు ఏర్పాటు చేసేవారు. తద్వారా సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఇంట్లోకి ప్రవేశించేవి. కనుక వారు వండిన పదార్థాల గురించి కానీ లేదా నిలువ ఉంచిన పదార్థాల గురించి గానీ జాగ్రత్త పడేవారు.
నేడు కరెంటు ఉండి , RCC తో కట్టుకుంటున్న ఇల్లు వచ్చినప్పటికీ అదే ఆచారం నేటికీ అలాగే కొనసాగుతుంది.

పంచాంగంలో గ్రహణము రోజున కొన్ని గంటల ముందు ఎలాంటి పదార్థాలు తినరాదు అని చెబుతారు. అక్కడే రోగులు, చిన్న పిల్లలు, వృద్ధులు మినహా అని కూడా చెబుతారు.

👉 ఇక్కడే మీరు కొద్దిగా లోతుగా ఆలోచించాలి. గ్రహణ వేద వలన ఆహారానికి ఏదైనా దుష్ప్రభావం కలిగితే త్వరగా ఎఫెక్ట్ అయ్యేది కేవలం రోగులకి, చిన్న పిల్లలకి వృద్ధులకి మాత్రమే !, కానీ పంచాంగ కర్తలు మన పెద్దవారు పై వారికి మాత్రమే Exemption ఇవ్వడంలో అర్ధం ఏంటి ?

గ్రహణం సమయం ఉపాసనకి చాలా విశేషం. గ్రహణ సమయానికి ముందు సుష్టు గా భోజనం చేస్తే శరీరం మత్తు గా ఉండిపోతుంది. ఈ సమయం మళ్ళీ గ్రహణం సంభవించే వరకు రాదు కనుక ఆహార నియమాలను పాటించి గ్రహణ సమయంలో దైవ సన్నిధిలో జపం పారాయణం చేయాలి అనే ఉద్దేశ్యం ఉంది. కాదంటారా ?

అయితే మకర,కుంభ,మిధున ,తులారాశుల వారికి అథమఫలితాలు అని, మేషం, వృషభరాశి, కన్యరాశి, మీనరాశి వారికి ఉత్తమ ఫలితాలు అని, మిగతా రాశుల వారికి మధ్యమ ఫలాలు అని ఇలా ఎవరి శాస్త్ర పరిజ్ఞానం మేరకు వారు సూచనలు చెయ్యడం జరుగుతోంది. అయితే ఇంతవరకుశాస్త్ర పరిజ్ఞానం మేరకు వారు సూచనలు చెయ్యడం జరుగుతోంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది కాని ఇది నూటికి నూరు శాతం యదార్థం అనుకోలేం… పంచాంగం ల్లో, వివిధ టి వి ఛానల్స్ రాశి ఫలితాలు కార్యక్రమాల్లో ఒక విషయం స్పష్టం చేస్తారు. “ఈ ఫలితాలు యదాతధం గా తీసుకోనవసరం లేదు వ్యక్తిగత జాతకం బట్టి ఫలితాలు మారుతాయి అనీ ” మరి అలాంటప్పుడు ఆయా రాశుల వారి పై అందరికీ ఇప్పుడు మాత్రం ఒకే తరహా ఫలితాలు ఎందుకు ఉంటాయి? కనుక అథమ ఫలితాలు అన్న రాశులవారు బెదరనవసరం, ఉత్తమ ఫలితాలు అన్నవారు మురియనవసరం లేదు. అలాగే ఈ దోషాలు 150రూ లకే పోగడుతాం అనే వారు, జపాలు, హోమాలు, దానాలు అంటూ భయపెట్టేవారు, సరే డబ్బు ఉన్న వారు ఏవోపాట్లు పడతారు అనుకుందాం! మరి లేని వాళ్ళు.. వారికి దోష ప్రక్షాళన లేదా? లేకుంటే ఆ రాశుల్లో వీరు జన్మించరా? కావున అనవసరపు భయాలు ఎవరూ పెట్టుకోవద్దు… మన వ్యక్తిగత జాతకం, ప్రారబ్ధకర్మలు బట్టే గ్రహణ ప్రభావం ఉంటుంది తప్ప పూర్తి గా రాశుల బట్టి మాత్రం కాదు, ఆత్మవిశ్వాసం, భగవంతుడు మనకు ఏవిధంగా చెడు చెయ్యదు అని నిష్కల్మషమైన భావంతో గ్రహణాన్ని
విక్షీంచిన కూడా ఏమంత భయపడనవసరం లేదు,

ఒక వేళ దాన ధర్మాలు చెయ్యగలిగే స్తోమత మనకు ఉంటే పూర్తి పేద వారికి సహాయం /దానం చెయ్యండి వంద రెట్లు పుణ్యం వస్తుంది. అనుమానం తో మనం ఏమి చేసినా అది నిష్ప్రయోజనమే అవుతుంది..

👉 గ్రహణం ముందు అనంతరం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ?
గ్రహణం పట్టే కొన్ని గంటల సమయం ముందు దేవుని మందిరంలో మరుసటి ఉదయం వరకు దీపారాధన ఉండే విధంగా పెట్టండి.
👉 దేవుని విగ్రహాల పైన దర్భలను ఉంచండి
👉 వంట పాత్రలు పచ్చళ్ళు పైన మూతలు చక్కగా పెట్టి ఉంచండి.( దర్భలు వేయడం ఆచారంలో ఉంది, అందువలన ప్రయోజనం ఏమీ లేదు. ఆచారాన్ని తప్పుపట్టడం లేదు సుమా! అన్యధా భావించకండి )
👉 గ్రహణం సమయంలో గర్భవతులు ఇంటి నుండి బయటకు రాకపోతే సరి. ఇంట్లో నియమాలు ఏమీ అవసరంలేదు .
👉 గ్రహణం సమయంలో మూల మంత్ర జపాలు శివ పంచాక్షరి అష్టాక్షరి మంత్ర జపాలు చేసుకుంటే మంచిది.
👉 గ్రహణం సమయంలో భోజనం చేయడం స్త్రీ సంగమం వంటివి పనికిరావు
👉 గ్రహణం అనంతరం ఇల్లు శుభ్రం చేసుకోవడం దేవుని విగ్రహాలు శుభ్రం చేసుకోవాలి.
👉 యజ్ఞోపవీతధారులు అందరూ నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి.

About admin

Check Also

మాఘ పౌర్ణమి… ఊరు ఖాళీ… ఎందుకు?

హిందువులు పౌర్ణమిలన్నింటి కంటే మాఘ పౌర్ణమిని చాలా విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులనీ ఈ మాఘమాసంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *